రేవంత్, ఈటల తీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది : కవిత
X
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రేవంత్, ఈటల తీరు ఉందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. కేసీఆర్పై పోటీ చేస్తున్న వారికి చివరకు ఆ వాతలే మిగులుతాయని సెటైర్ వేశారు. నిజామాబాద్లో గోసంగి కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. దళితులకు ఇచ్చే అన్ని పథకాలకు గోసంగి కులస్థులకు వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక అర్హులైన అందరికీ దళిత బంధు ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ తోనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారురేవంత్, ఈటల తీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది : కవిత
గాంధీభవన్లో రేవంత్ అనే గాడ్సే దూరిండని.. అందుకే ఆ పార్టీలోని బీసీలకు అన్యాయం జరుగుతోందని కవిత ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ పాలనపై అక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని.. కానీ ఆ రాష్ట్ర సీఎం మాత్రం ఇక్కడికి వచ్చి కేసీఆర్ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 50ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు.