Home > తెలంగాణ > సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
X

తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆమె తరపున లాయర్లు కోర్టకు తెలిపారు. ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. మార్చి 15న ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్‌ చేస్తూ కవిత పిటిషన్‌ వేశారు. కేసు విచారణ జరుగుతుండగానే అరెస్టు చేసినట్లు అందులో ఆరోపించారు.

గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోము అని కోర్టుకు చెప్పి… దర్యాప్తు సంస్థ అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి.. దర్యాప్తు సంస్థ పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటికే కవితను అరెస్టు చేసినందున పిటిషన్ అవసరం లేదని కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వెల్లడించారు. దీనికి జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం అనుమతించింది. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని చౌదరి తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ.. గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత ఈ పిటషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే

Updated : 19 March 2024 5:57 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top