BRS MLCs Protest. : బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..మండలి వాయిదా
X
శాసన మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసన దిగారు. నల్ల కండువాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు మండలి చైర్శన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూడదన్నారు.
సభ్యులు పోడియంను చుట్టిముట్టి అందోళన చేయండంతో మండలి ఛైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాగా శాసనసభ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు. విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని ఆమె కోరారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలను వేసుకొని శాసన మండలికి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నల్ల కండువాలు వేసుకొని రావద్దని పోలీసులు సూచించారు. నిరసన తెలపడం తమ హక్కని, కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, శోభన్ రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ తదితరులు సభలోకి వెళ్లిపోయారు.