Home > తెలంగాణ > KCR : ఖమ్మం, మహబూబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన..మళ్లీ సీట్టింగ్‌లకే సీట్లు

KCR : ఖమ్మం, మహబూబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన..మళ్లీ సీట్టింగ్‌లకే సీట్లు

KCR : ఖమ్మం, మహబూబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన..మళ్లీ సీట్టింగ్‌లకే సీట్లు
X

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాద్ అభ్యర్థిగా మలోతు కవితను మరోసారి ఖరారు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నామా, కవిత ఇద్దరు బీఆర్‌ఎస్ నుంచి ఎంపీలుగా గెలుపోందారు. తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఖమ్మం, మహబూబాద్ లోక్ సభ పరిధిలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రారావు హాజరు కాలేదు. ఆయన గైర్హాజరయ్యారు కావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.





ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే విజయం సాధించారు. తాజాగా మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలోనే ఆయన కాంగ్రెస్ నేతలను కలిశారు. నిన్న కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు కేసీఆర్ కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై నేతలతో అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు.




Updated : 4 March 2024 5:47 PM IST
Tags:    
Next Story
Share it
Top