కాళేశ్వరానికి కేంద్రం నిధులిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తాం: బీఆర్ఎస్ ఎంపీ
X
కాళేశ్వరంపై లోక్సభలో కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిలదీశారు. కాళేశ్వరానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. ప్రాజెక్టుకు పైసలు ఇచ్చినట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేస్తామని అన్నారు. బీజేపీ ఎంపీలు అబద్ధాలు చెప్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై బీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక నిషికాంత్ దూబే కాళేశ్వరంపై అసత్యాలు మాట్లాడుతున్నారని నామా విమర్శించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉక్కు కర్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. గత తొమ్మదేళ్లుగా కేంద్రం తెలంగాణపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుదని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం కేంద్రంపై ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం 86వేల కోట్లు ఇచ్చిందని నిషికాంత్ దూబే అన్నారు. దీంతో ఆయనపై బీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. దీనిపై కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలని అని ప్రశ్నించారు. ఒక్క పైసా ఇచ్చి నట్లు చూపిస్తే మేము దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు.