మోడీ సర్కారుపై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం
X
కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. మణిపూర్ అంశంపై కేంద్రం స్పందన సరిగా లేదని ఆరోపించింది. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోక్ సభ సెక్రటరీ జనరల్ కు లేఖ రాశారు. రూల్ రూల్ 198(బీ) ప్రకారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు చెప్పారు. బుధవారం నాటి లోక్‌సభ బిజినెస్‌లో ఈ నోటీసును చేర్చాలని నామా సెక్రటరీ జనరల్‌ను కోరారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయల్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటీస్ ఇచ్చారు.
మణిపూర్ అంశంపై చర్చకు ప్రధాని మోడీ ముఖం చాటేయడం వల్లే కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని నామా చెప్పారు. విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నా ప్రధాని మాత్రం స్పందించడంలేదని వాపోయారు. ఒకవేళ ప్రధాని నోరు విప్పితే దేశ ప్రజల్లో శాంతి నెలకొంటుందని అన్నారు. ఇందుకోసం తమ వంతు ప్రయత్నంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినట్లు నామా స్పష్టం చేశారు.
BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q
— ANI (@ANI) July 26, 2023
#WATCH | BRS MP Nama Nageswara Rao says, "We have moved the No Confidence Motion on behalf of our party. Since the commencement of the session all Opposition leaders had been demanding discussion on Manipur issue. If the PM speaks on this, there will be peace among people of the… https://t.co/wHC997gWVm pic.twitter.com/Jb9NWfEKPR
— ANI (@ANI) July 26, 2023