Home > తెలంగాణ > ద లీడర్ ఈజ్ బ్యాక్.. ఎంపీ సంతోష్ ట్వీట్ వైరల్

ద లీడర్ ఈజ్ బ్యాక్.. ఎంపీ సంతోష్ ట్వీట్ వైరల్

ద లీడర్ ఈజ్ బ్యాక్.. ఎంపీ సంతోష్ ట్వీట్ వైరల్
X

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారు. ఇటీవలే బాత్రూమ్‌లో జారిపడి తుంటి ఎముక విరగ్గా.. వైద్యులు సర్జరీ చేశారు. అప్పటి నుంచి ఆయన బెడ్కే పరిమితమయ్యారు. ఆస్పత్రిలో ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహా కొంతమంది ప్రముఖులు పరామర్శించారు. ఇక ఇటీవల ఏపీ సీఎం జగన్ కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు. ఇదే క్రమంలో ఇవాళ మాజీ గవర్నర్ నరసింహన్ కేసీఆర్ను పరామర్శించారు.

ఈ క్రమంలో నరసింహన్తో కేసీఆర్ కుర్చీలో కూర్చోని ముచ్చటించారు. సర్జరీ తర్వాత బెడ్‌కే పరిమితమైన ఆయన లేచి కుర్చీలో కూర్చోవడం ఇదే తొలిసారి. మొన్న జగన్ వచ్చినప్పుడు కూడా ఆయన బెడ్ పైనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సంతోష్ కేసీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘నాయకుడు తిరిగొచ్చాడు. సంచలనాలు సృష్టించడానికి సిద్ధమయ్యాడు’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. ఇటీవల హరీష్ రావు సైతం కేసీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటన చేస్తారని చెప్పారు. తమ నాయకుడు తిరిగి వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు.


Updated : 7 Jan 2024 9:12 PM IST
Tags:    
Next Story
Share it
Top