Home > తెలంగాణ > Nandikanti Sridhar : ఆ పార్టీలో చేరనున్న నందికంటి.. ఎమ్మెల్సీ ఆఫర్..?

Nandikanti Sridhar : ఆ పార్టీలో చేరనున్న నందికంటి.. ఎమ్మెల్సీ ఆఫర్..?

Nandikanti Sridhar : ఆ పార్టీలో చేరనున్న నందికంటి.. ఎమ్మెల్సీ ఆఫర్..?
X

కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆదివారం మెదక్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పగా.. ఈ రోజు మల్కాజ్ గిరి డీసీసీ చీఫ్ నందికంటి శ్రీధర్ హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. వారిద్దరూ త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. ఇటీవలే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కారణంగానే వారిద్దరూ పార్టీని వీడారు. మల్కాజ్గిరి టికెట్ను మైనంపల్లికి, మెదక్ టికెట్ ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో ఆ స్థానాలపై ఆశపెట్టుకున్న నందికంటి శ్రీధర్, కంఠారెడ్డి తిరుపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మైనంపల్లి కారణంగా టికెట్ కోల్పోయిన నందికంటికి బీఆర్ఎస్ గాలం వేసినట్లు సమాచారం. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్‌కు చెందిన నందికంటి సమీప బంధువైన ఓ నేతతో బీఆర్ఎస్ నేతలు రాయబారం నడిపినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ హైకమాండ్ హామీ మేరకే నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన గులాబీ కండువా ఎప్పుడు కప్పుకుంటారన్నదానిపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశముంది.

నందికంటి శ్రీధర్ 1994 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. 2018లోనే ఆయనకు మల్కాజ్ గిరి టికెట్ ఇస్తారని భావించినా పొత్తుల్లో భాగంగా దక్కలేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో తప్పకుండా టికెట్ వస్తుందని ఆశపెట్టుకున్నారు. తాజాగా మైనంపల్లి హనుమంతరావును పార్టీలోకి తీసుకురావడం, పార్టీ కోసం ఇన్నాళ్లుగా కష్టపడ్డ తనను కాదని మైనంపల్లి ఫ్యామిలీకి ఏకంగా రెండు టికెట్లు ఇవ్వడంతో నందికంటి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.




Updated : 2 Oct 2023 4:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top