Home > తెలంగాణ > ఈ నెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఈ నెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఈ నెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
X

సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఎంపీలకు దిశా నిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 15న కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీలతో ప్రగతి భవన్లో భేటీ కానున్నారు.

ఈనెల 18నుంచి 22వరకు 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు, ఇండియా పేరు మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాపై చర్చించేందుకు కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ రాజ్యసభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరుకావాలని పార్టీ అధినేత ఆదేశించారు.


Updated : 11 Sept 2023 10:51 PM IST
Tags:    
Next Story
Share it
Top