Home > తెలంగాణ > నేటి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ సమావేశాలు..ఎంపీ అభ్యర్థుల ఎంపీకపై కేసీఆర్ ఫోకస్

నేటి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ సమావేశాలు..ఎంపీ అభ్యర్థుల ఎంపీకపై కేసీఆర్ ఫోకస్

నేటి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ సమావేశాలు..ఎంపీ అభ్యర్థుల ఎంపీకపై కేసీఆర్ ఫోకస్
X

లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. నేడు కరీంనగర్, పెద్దపల్లి నాయకులతో చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు కత్తి మీద సాములా మారాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించకుంటే ఆ పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం పడనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్ సభ పోరులో పునరావృతం కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ ఎన్నికలు గులాబీ దళానికి సవాల్ విసురుతున్నాయి. ఈ పార్టీ నుంచి కీలక నేతల వలసలు కొనసాగుతున్నాయి. టికెట్ వస్తుందో రాదోనన్న అనుమానంతో కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు.

ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన పార్టీ ఇవాళ్టి నుంచి లోక్ సభ ఎన్నికల అభ్యర్థిత్వాలపై దృష్టి సారించనుంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ అధినేత కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్‌ సమావేశం అవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీచేస్తే బాగుంటుందనే అంశంపై నేతలనుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లే. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్‌నేత పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరంతో ఈ రేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది. వరంగల్‌లో గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ గాలిలో అలవోకగా తెలిసిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఈసారి విశ్రాంతి తప్పదని ప్రచారం జరుగుతుంది. మరీ ఆయన స్థానంలో ఎవరిని బరిలోకి దింపుతారు..? ఎవరికీ ఈ సీట్ కట్టబెట్టబోతున్నారు అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోంది.ప్రస్తుతం ఐదుగురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి వారిలో ముఖ్యంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Updated : 3 March 2024 8:35 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top