Home > తెలంగాణ > KCR : అసెంబ్లీకి కేసీఆర్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

KCR : అసెంబ్లీకి కేసీఆర్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

KCR : అసెంబ్లీకి కేసీఆర్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం
X

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ కేసీఆర్తో ప్రమాణం చేయించారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అనారోగ్య కారణంగా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. తాజాగా ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

కేసీఆర్‌ తుంటి ఎముకకు ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కోలుకున్న కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ తన ఛాంబర్కు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.


Updated : 1 Feb 2024 7:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top