Home > తెలంగాణ > KTR : నేడు ఎల్‌ఆర్‌ఎస్‌పై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నిరసనలు

KTR : నేడు ఎల్‌ఆర్‌ఎస్‌పై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నిరసనలు

KTR : నేడు ఎల్‌ఆర్‌ఎస్‌పై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నిరసనలు
X

ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని నేడు బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అన్ని నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జీహెచ్​ఎమ్​సీ, హెచ్​ఎమ్​డీఏ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్​ నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొంటున్నారు. అంతేగాక రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేయనున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి , సీతక్క ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇస్తామన్నారని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మరచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. ఈ పథకం ద్వారా ప్రజల నుంచి 20 వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు.




Updated : 6 March 2024 6:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top