Home > తెలంగాణ > ప్రజలను మోసగిస్తున్న బీఆర్‌ఎస్‌‎కు గుణపాఠం చెప్పాలి..ఎమ్మెల్యే సీతక్క

ప్రజలను మోసగిస్తున్న బీఆర్‌ఎస్‌‎కు గుణపాఠం చెప్పాలి..ఎమ్మెల్యే సీతక్క

ప్రజలను మోసగిస్తున్న బీఆర్‌ఎస్‌‎కు గుణపాఠం చెప్పాలి..ఎమ్మెల్యే సీతక్క
X

అమలుకు సాధ్యం కాని పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో పలువురు చేరారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆమె ఎద్దేవా చేశారు. రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్‌‎ను అధికారం నుంచి దింపడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు." తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 500కే గ్యాస్‌ అందిస్తాం. వృద్ధులకు రూ. 4 వేల పించన్ ఇప్పిస్తాం. ఇందిరమ్మ గృహ నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రజలకు అందిస్తాం. 24 గంటల ఉచిత విద్యుత్‌ తో పాటు రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తాం. భూమి ఉన్న అన్నదాతలకు ఎకరానికి రూ. 15వేల సాయం అందిస్తాం. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. రైతు కూలీలకు రూ. 12వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం" అని సీతక్క తెలిపారు.




Updated : 26 Aug 2023 2:47 PM IST
Tags:    
Next Story
Share it
Top