KTR : కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేసిండు : కేటీఆర్
X
లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. ఈ మేరకు శనివారం (జనవరి 27) నుంచి రాష్ట్రం వ్యప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా.. పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ఇవాళ తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికి వచ్చి వివరాలు సేకరించామని అన్నారు. కానీ అధికారం చేపట్టి 100 రోజులు కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీ ప్రజలను రోడ్డు పైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఏ పనికావాలన్ని ప్రజలు పాతరోజుల్లోలాగ రోడ్డు పైకి వచ్చి లైన్లు కడుతున్నారని విమర్శించారు.
పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆలస్యం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజమని ఆయన విమర్శించారు. ఇప్పుడు కూడా ప్రజలను మోసం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. గెలిచేందుకు కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలను ప్రకటిచిందని, వాటిని అమలు పరిచేందుకు ఇప్పుడు తంటాలు పడుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి కూడా సికింద్రాబాద్ కు చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సమావేశాలు ముగిస్తాయి. నియోజకవర్గల్లోని సమస్యలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. లోక్ సభ ఎలక్షన్స్ కు సంబంధించి నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తలతో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశాల బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీలు చూసుకోవాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ షెడ్యూల్:
➤ ఈనెల 27న సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాలు.
➤ 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాలు.
➤ 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గాలు.