Home > తెలంగాణ > మేడిగడ్డను భూతద్దంలో చూస్తున్నారు - కేటీఆర్

మేడిగడ్డను భూతద్దంలో చూస్తున్నారు - కేటీఆర్

మేడిగడ్డను భూతద్దంలో చూస్తున్నారు - కేటీఆర్
X

60 రోజుల కాంగ్రెస్‌ పాలన అయోమయంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. 420 హామీలకు బడ్జెట్లో కేవలం రూ. 57 వేల కోట్లు మాత్రమే కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహాలక్ష్మి పథకానికే దాదాపు రూ. 50 వేల కోట్లు అవసరమవుతుందని అలాంటప్పుడు రైతు బంధు, ఆసరా, రుణమాఫీకి నిధులు ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతో హైదరాబాద్‌ అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు మూర్ఖుల్లా మాట్లాడుతున్నారని, వారికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అ తెలియదు.. ఆ ఆ తెలియదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చూడాలనుకుంటే కాంగ్రెసోళ్లు వెళ్లి చూడొచ్చని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని విమర్శించారు. చిన్న చిన్న లోపాలుంటే ఎత్తిచూపాలేకానీ దాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు బట్టకాల్చి మీద వేస్తున్నట్లు మాట్లాడుతున్నారన్న కేటీఆర్.. తప్పు జరిగితే బయటపెట్టాలని అన్నారు. ఐఏఎస్లపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated : 10 Feb 2024 7:45 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top