Home > తెలంగాణ > KTR comments: బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR comments: బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR comments: బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన మంచికే వచ్చాయని చెప్పిన కేటీఆర్.. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తోందని.. అలాగే కాంగ్రెస్ పాలన చూస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన విలువ ఏంటో తెలుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను చూసి జనం మోసపోయారని, కాంగ్రెస్‌ మాటల ప్రభుత్వమే.. చేతల ప్రభుత్వం కాదని ప్రజలు గుర్తించారన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందని గుర్తు చేశారు. మార్చి 17కి కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లోకి వచ్చి 100 రోజులు అవుతోందని.. 100 రోజుల్లో హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్‌ను బొందపెట్టుడేనన్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు నేరవేర్చకుంటే ప్రజా ఉద్యమాలు చేద్దామాని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. "రేవంత్‌ రెడ్డి మాట్లాడే భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రేవంత్‌లాగా మేము కూడా తిట్టగలం. కానీ, మాకు సభ్యత ఉంది’ అని అన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని.. ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల ప్రజలు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫ్రీ బస్సు పథకం సరిగ్గా అమలు చేయాలంటే ప్రభుత్వం మరిన్నీ బస్సులు పెంచాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న 16 మంది ఆటో డ్రైవర్ల చావులకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలన్నారు. ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే పార్లమెంట్‌లో కేసీఆర్ దళమే ఉండాలన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ను మడతపెట్టి కొట్టుడే అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.

Updated : 4 Feb 2024 4:34 PM IST
Tags:    
Next Story
Share it
Top