Home > తెలంగాణ > KTR : కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజర్ - కేటీఆర్‌

KTR : కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజర్ - కేటీఆర్‌

KTR : కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజర్ - కేటీఆర్‌
X

కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే ప్రమాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకుంటున్న కేసీఆర్.. ఫిబ్రవరిలో ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ నేతలు ఉద్యమంలో గట్టిగా పోరాడిన వారేనని కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తమ పోరాట పటిమను అందరూ చూశారని చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన వెంటనే అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా రివ్యూ ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి రెండు మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.




Updated : 9 Jan 2024 5:14 PM IST
Tags:    
Next Story
Share it
Top