Home > తెలంగాణ > ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే దీక్ష

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే దీక్ష

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే దీక్ష
X

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన శనివారం గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి ప్రవీణ్ కుమార్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దీక్ష వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. పార్టీ నాయకలు, కార్యకర్తలను సైతం ఇంట్లోకి అనుమతించడం లేదు.

పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ప్రవీణ్ కుమార్ ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. తెలంగాణ గడ్డ కేసీఆర్ లాంటి నియంతలను ఎంతో మందిని చూసిందన్న ప్రవీణ్.. తాటాకుల చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టంచేశారు. మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నడిచిన పాలకులందరూ చరిత్రలో మట్టికరిచిపోయారని మండిపడ్డారు.

Updated : 12 Aug 2023 10:17 AM IST
Tags:    
Next Story
Share it
Top