Home > తెలంగాణ > సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం..

సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం..

సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం..
X

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సంస్థ ఎండీ సజ్జనార్ సంక్రాంతి బస్సుల ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు.ఆర్ఎంలు, డీఎంలు, జిల్లా ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది పండగ సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు సజ్జనార్‌ ప్రకటించారు. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే స్పెషల్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. పండగ స్పెషల్ బస్సుల్లో తెలంగాణ పరిధిలో మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. రేపట్నుంచి ఈ నెల 15వ తేదీ వరకూ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

తెలంగాణలోని జిల్లాలతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ సర్వీసులపైనా అధికారులు ఫోకస్ చేయాలని ఎండీ సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నారు. దీంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు కూడా స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేశారు.

Updated : 5 Jan 2024 12:40 PM GMT
Tags:    
Next Story
Share it
Top