Hyderabad: తెల్లవారుజామున అగ్నిప్రమాదం.. ఆర్టీసీ బస్సులు దగ్ధం
X
హైదరాబాద్ నగరంలోని దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదంచోటు చేసుకుంది. రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయాయి. మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా రెండు బస్సులకు నిప్పు అంటుకోవడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమయానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారాణాలేంటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. బస్సులకు మంటలు ఎలా అంటుకున్నాయి. ఎవరైన నిప్పు పెట్టారా.. లేక బస్సులో ఎలక్ట్రికల్ సమస్య వల్ల నిప్పులు చెలరేగాయా అనే కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ : బస్సులు దగ్ధం…
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2024
దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున రెండు బస్సులకు మంటలు అంటుకున్నాయి. ఓ బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. పక్కనే అనుకోని ఉన్న మరో బస్సు పాక్షికంగా దగ్ధం అయ్యింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/ZLr1MFpqjJ
ప్రమాద సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని డీపో అధికారులు తెలిపారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదంపై సంబంధిత అధికారులు పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.