వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు - కేటీఆర్
X
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 రోజుల పాటు కురిసిన వర్షాలు, వరద పరిస్థితిపై కేబినెట్లో చర్చ జరిగింది. వరదల వల్ల జరిగిన నష్టంపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించింది. పది జిల్లాల్లో భారీ వర్షాల వల్ల రైతులు, ప్రజలకు తీవ్ర నష్టం పంటలు, రహదారులు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయా జిల్లాకు తక్షణసాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని, వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన 40 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పొలాల్లో ఇసుక మేటలపై నివేదిక ఇవ్వడంతో పాటు వరద కారణంగా తెగిన రోడ్లు, కూలిన కల్వర్టుల మరమ్మతులు చేయించాలని కలెక్టర్లకు ఆదేశించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు.భారీ వరదలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన ఇద్దరు ఉద్యోగులను సన్మానించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 15న వారిద్దరికీ సత్కారు చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.