ముగిసిన కేబినెట్ భేటీ.. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం
X
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో.. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ఆమోదం లభించింది. రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనున్నారు. ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో.. ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనే దానిపై దాదాపు గంటన్నర పాటు కేబినెట్ లో చర్చించారు.
తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది? రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? అనే అంశాలతో గవర్నర్ ప్రసంగం ఉంబోతుందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులోని రెండింటిని ఇప్పటికే అమలు చేసిన విషయం తెలిసిందే. మిగతా నాలుగు గ్యారంటీల అమలుపై కేబినెట్ మీటింగ్ లో చర్చించినట్లు తెలుస్తుంది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ఆమోదం ఇచ్చింది.