Home > తెలంగాణ > మైలార్దేవ్పల్లిలో కారు బీభత్సం.. స్టూడెంట్ మృతి

మైలార్దేవ్పల్లిలో కారు బీభత్సం.. స్టూడెంట్ మృతి

మైలార్దేవ్పల్లిలో కారు బీభత్సం.. స్టూడెంట్ మృతి
X

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ స్టూడెంట్ స్పాట్ లోనే చనిపోగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.





దుర్గా నగర్ చౌరస్తాలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వేగానికి కారు కారు పల్టీలు కొడుతూ రోడ్డుపై ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్థి చంద్రశేఖర్‌ చనిపోయాడు. మరో ఇద్దరు స్టూడెంట్స్కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు మద్యం సేవించి కారు నడిపినడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం.




Updated : 24 Aug 2023 8:59 AM IST
Tags:    
Next Story
Share it
Top