Home > తెలంగాణ > కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి పసిపాప బలి

కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి పసిపాప బలి

కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి పసిపాప బలి
X

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ పసిపాప బలైంది. కారు డోరు తగిలి బైక్పై నుంచి పడిపోవడంతో రెండేండ్ల చిన్నారి స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది. రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. హృదయవిదారకమైన ఈ ఘటన హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లో జరిగింది.

మన్సూరాబాద్‌-ఎల్బీనగర్‌ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్ ముందువెనుకా చూసుకోకుండా హఠాత్తుగా కారు డోర్‌ తీశాడు. అదే టైంలో వెనుక నుంచి ఓ దంపతులు చిన్నారితో కలిసి బైక్పై వస్తున్నారు. సడెన్గా డోర్ తీయటంతో వెనక నుంచి వస్తున్న బైక్కు తగలడంతో దానిపై ప్రయాణిస్తున్న పాపతో పాటు ఆమె తల్లిదండ్రులు కిందపడిపోయారు. కారు డోర్‌ బలంగా తగలడంతో రెండేళ్ల చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో తల్లి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధ్యతారహితంగా వ్యవహరించిన డ్రైవర్‌పై జనం భగ్గుమంటున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

car driver negligence took life of two years old kid


Updated : 2 Jun 2023 4:05 PM IST
Tags:    
Next Story
Share it
Top