Home > తెలంగాణ > ఎన్టీఆర్ మార్గ్లో కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం

ఎన్టీఆర్ మార్గ్లో కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం

ఎన్టీఆర్ మార్గ్లో కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం
X

హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు ఎన్టీర్‌ మార్గ్‌లో అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. రెయిలింగ్‌కు తగిలి ఆగిపోయిన కారు.. కొద్దిలో హుస్సేన్‌సాగర్‌లో పడిపోయేది. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌ బెలున్స్‌ తెరచుకోవడంతో అందులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. కారును అక్కడే వదిలేసి పారిపోయారు.





ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ చెట్టు సైతం కూలిపోయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సహాయంతో కారును అక్కడి నుంచి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Updated : 30 July 2023 11:43 AM IST
Tags:    
Next Story
Share it
Top