పోలింగ్ ముందు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికోసం ఈసీ పగడ్భందీగా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం పలు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఓటర్లకు డబ్బు ఎరచూపి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై తాజాగా కేసు నమోదైంది. ఓటరుకు రూ.లక్ష ఆఫర్ చేశారన్న ఆరోపణలపై.. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 171 సి, 188, 123 ఆర్‌పీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
పోలింగ్ దృష్యా హైదరాబాద్ లోని విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవు ప్రకటించారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈసీ ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసింది. డబ్బు, మధ్యం పంపిణీ జరగకుండా.. దానికి అనుగుణంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రం వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతుంది. పట్టుబడ్డ నగదును సీజ్ చేసి, తరలిస్తున్న వారిపై కేసులు నమోదుచేస్తున్నారు.