Home > తెలంగాణ > జనగాం పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురిపై కేసు..?

జనగాం పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురిపై కేసు..?

జనగాం పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురిపై కేసు..?
X

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు జనగామ పోలీసులు కేసు రిజిస్టర్ చేసినట్లు సమాచారం. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, అధికార కార్యక్రమాలకు తన కుమార్తెతో పాటు అల్లుడు రాహుల్ రెడ్డి భంగం కలిగిస్తున్నారంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జూన్ 26న హైకోర్టును ఆశ్రయించారు. వారిద్దరూ తన ప్రాథమిక హక్కులను హరించేలా వ్యవహరిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తన అధికారిక విధులు, వ్యక్తిగత పనులకు ఆటంకం కలిగించకుండా చూడాలని జనగామ, చేర్యాల పోలీస్ స్టేషన్లలో జూన్ 22న కంప్లైంట్ చేసినా పట్టించుకోలేని అన్నారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీతో పాటు జనగామ, సిద్దిపేట డీసీపీలు, జనగామ, చేర్యాల సీఐలను ప్రతివాదులుగా చేర్చుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు.

ముత్తిరెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. గత నెల 27న ప్రతివాదులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే ఇచ్చిన పిటిషన్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియజేస్తూ ఈ నెల 27లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫిర్యాదును పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల సీఐలకు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్పందించిన జనగామ పోలీసులు ఎమ్మెల్యే కూతురు తుల్జా భవానీరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Updated : 12 July 2023 12:27 PM IST
Tags:    
Next Story
Share it
Top