Home > తెలంగాణ > పోలీసులపై జులుం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

పోలీసులపై జులుం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

పోలీసులపై జులుం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు
X

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఓడించిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఓట్ల లెక్కింపు వేళ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతో పాటు. విధులకు ఆటంకం కల్పించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన కౌంటింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉన్నా.. బీఆర్ఎస్ కార్యకర్తలంతా గుమిగూడి ఉండటంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, కౌశిక్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్త కొంతసేపటికి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి అక్కడున్నవారిని చెదరగొట్టారు. ఈ ఘటన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిపై 506, 290, 303 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated : 4 Dec 2023 1:12 PM GMT
Tags:    
Next Story
Share it
Top