Home > తెలంగాణ > Balka Suman: ముఖ్యమంత్రిపై అడ్డగోలు వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Balka Suman: ముఖ్యమంత్రిపై అడ్డగోలు వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Balka Suman: ముఖ్యమంత్రిపై అడ్డగోలు వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
X

సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. కాగా, అంతకుముందు బాల్క సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాల్క సుమన్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేదంటే బాల్క సుమన్‌ను మంచిర్యాలలో తిరగనివ్వమని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

కాగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాల్క సుమన్. సోమవారం మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను రం.. అన్న రేవంత్ రెడ్డే పెద్ద రం.. అని అసభ్య పదజాలంతో దూషించారు. కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్‌ అనుచితంగా మాట్లాడారని అంటూనే.. ఈ క్రమంలో సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్‌. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్‌ వేయడంతో.. సుమన్‌ ఊగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని ఉందని.. కానీ సంస్కారం అడ్డువస్తుందని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కాంగ్రెస్ నేతలు.. తాజాగా బాల్క సుమన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.




Updated : 5 Feb 2024 3:48 PM GMT
Tags:    
Next Story
Share it
Top