Home > తెలంగాణ > బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడార్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని పీర్జాదిగూడకు చెందిన రాధిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 427, 447, 506 కింద అభియోగాలు నమోదయ్యాయి. రెసిడెన్షియల్ ప్లాట్‌గా ఉన్న స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేశారని బాధితురాలు తెలిపింది. అంతేగాక ఇదేంటని ప్రశ్నించినందుకు బెదిరించారని ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఆయన భార్య నీలిమ, మరో వ్యక్తి మధుకర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.



Updated : 26 Jan 2024 7:24 PM IST
Tags:    
Next Story
Share it
Top