హైదరాబాద్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
X
మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, హైకోర్టు న్యాయవాది వెంకటరమణపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాదగిరి అనే వ్యాపారి నుంచి రూ 10 కోట్లు తీసుకుని ఎగ్గొట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఓ కేసులో అనుకూలంగా రాకపోవడంతో డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించారు. యాదగిరి అనే వ్యక్తి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఓ ల్యాండ్ విషయంలో అనుకూలంగా తీర్పు ఇప్పిస్తానని లాయర్ వెంకటరమణ మోసం చేశారని బాధితుడు ఆరోపించారు. రూ.14 కోట్లు డిమాండ్ చేసి రూ.10 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తీర్పు అనుకూలంగా రాకపోగా పైసాలు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపించారు.
దీంతో వెంకటరమణ, బలాలపై కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు.వేదుల వెంకటరమణ తెలంగాణ హైకోర్టులో సీనియర్ లాయర్ బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున ఆయన చాలా కేసుల్ని వాదించారు. అయితే న్యాయమూర్తినే మ్యానేజ్ చేసి తీర్పు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం న్యాయవాద వర్గాల్లో సైతం సంచలనంగా మారింది. పది కోట్ల రూపాయలు ఇచ్చానని కూడా బాధితుడు చెబుతున్నాడు కాబట్టి.. వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటే.. ఈ విషయంలో లోతైన దర్యాప్తు చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వేదుల వెంకటరమణ తరపున బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మలక్ పేట ఎమ్మెల్యే కూడా.. ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నారు.