Home > తెలంగాణ > బీజేపీ పెద్దలను కలిసిన చీకోటి ప్రవీణ్.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ..?

బీజేపీ పెద్దలను కలిసిన చీకోటి ప్రవీణ్.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ..?

బీజేపీ పెద్దలను కలిసిన చీకోటి ప్రవీణ్.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ..?
X

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఆయన బరిలో దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటికి మరింత బలం చేకూర్చుతూ చీకోటి ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర నేతలను వరుసగా భేటీ అవుతున్నారు. ఉదయం బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను కలిసిన చీకోటి అనంతరం డీకే అరుణతోనూ భేటీ అయ్యారు. బీజేపీలో చేరాలనే తన అభిప్రాయాన్ని వారికి వివరించారు.

చీకోటి ప్రవీణ్ చేరికకు బండి సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పార్టీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీలో చీకోటి ప్రవీణ్ చేరిక లాంఛనమేనని, పార్టీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం చూసుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.

పొలిటికల్ ఎంట్రీపై చీకోటి ప్రవీణ్ చాలా కాలంగా ఆసక్తితో ఉన్నారు. ఏ పార్టీలో చేరతానేది ఇప్పట్లో వెల్లడించలేనంటూ గతంలో చెప్పారు. రేషన్ షాపు నడపటం నుంచి మొదలు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి క్యాసినో కింగ్‌గా చీకోటి ప్రవీణ్‌ పేరు తెచ్చుకున్నాడు. ఆయనపై ఈడీ కేసులు కూడా ఉన్నాయి. థాయిలాండ్, నేపాల్ దేశాల్లో క్యాసినో వ్యవహారాల్లో కూడా చీకోటి ప్రవీణ్ పేరు వినిపించింది.

Updated : 3 Aug 2023 4:13 PM IST
Tags:    
Next Story
Share it
Top