Home > తెలంగాణ > కిషన్ రెడ్డిని కలిసిన చికోటి ప్రవీణ్..

కిషన్ రెడ్డిని కలిసిన చికోటి ప్రవీణ్..

కిషన్ రెడ్డిని కలిసిన చికోటి ప్రవీణ్..
X

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్.. ప్రస్తుతం తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇండియా నుంచి ఓ గ్యాంగ్ను తీసుకెళ్లి బ్యాంకాక్లో క్యాసినో ఆడించి పోలీసులకు చిక్కాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే అవన్నీ అసత్యాలే అని చికోటి కొట్టిపారేశారు. ఆ తర్వాత నుంచి స్టేట్లో ఆయన యాక్టివ్గా మారారు. ఏదో ఒక పనితో వార్తల్లో నిలుస్తున్నారు. హిందూ ధర్మ రక్షణ, గో రక్షణ నినాదంతో ఆయన పలుచోట్ల కన్పిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని చికోటి ప్రవీణ్ కలిశారు. అంబర్పేట శంకర్తో కలిసి ఆయన కిషన్ రెడ్డిని మీట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలో వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్నారు. గతంలో బండి సంజయ్, డీకే అరుణ, రామచంద్రరావు సహా పలువురి నేతలను కలిశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చికోటి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ఆయన.. వరుసగా ఆ పార్టీ నేతలను కలుస్తున్నట్లు సమాచారం.

Updated : 10 Aug 2023 10:18 PM IST
Tags:    
Next Story
Share it
Top