క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ నయా ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?
X
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ తమ యాక్షన్ ప్లాన్స్‌ను అమలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో కొన్ని పార్టీల్లో జంపింగ్స్ జరుగుతున్నాయి. ప్రధాన పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డారు. తాను నివాసం ఉండే ఎల్బీనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. భారీ సంఖ్యలో ఫాలోవర్స్‌ను సమీకరించి పార్టీ కార్యాలయానికి చేరుకుంటే బీజేపీ చికోటిని ఛీ కొట్టింది. చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది. దీంతో అనుకోని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చికోటి చేరికకు బ్రేకులు పడ్డాయి.
పార్టీలో చేరిక విషయం పక్కన పెడితే, కనీసం చికోటిని రిసీవ్ చేసుకునేందుకు కూడా బీజేపీ కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో ఆయన తల కొట్టేసినంత పనైయ్యింది. క్యాసినో కింగ్‌ను ఘొర అవమానం జరిగింది. ఈ విషయంలో ఆయన ఫాలోవర్స్ కూడా బీజేపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారట. బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న చికోటి
తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరే పార్టీలో చేరకుండా సొంతంగా ఓ పార్టీ పెట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
బీజేపీ తన పట్ల వ్యవహరించి తీరుతో ఆగ్రహంతో ఉన్న చికోటి ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. తన చేరిక బీజేపీలో కొంత మందికి నచ్చడం లేదని చెప్పుకొచ్చారు. అంతే కాదు బీజేపీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పార్టీ నేతలపై ఘాటుగా స్పందించారు. తనను ఎవరూ ఏం చేయలేరని, నా రాజకీయం ఏంటో చూపిస్తా అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి అంటే.. చికోటి ఓ కొత్త పార్టీ ప్రారంభించే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చికోటి కొత్త పార్టీ పెట్టాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నేతలను ఆయన్ని ఒత్తిడి చేస్తున్నాట. బీజేపీ తీరుపై ఇప్పటికే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నేతలు ప్రవీణ్‌ను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఈ అవమానం కులానికి జరిగినట్లుగా భావిస్తున్నారట. అందుకే ఓ కొత్త పార్టీ పెట్టాలని సూచిస్తున్నారని సమాచారం. అంతే కాదు కొత్త పార్టీ కనుక స్థాపిస్తే హిందుత్వ సంస్థలను కలుపుకుని ముందుకు వెల్దామని ఆయన్ను ప్రొత్సహిస్తున్నారట నేతలు. అసెంబ్లీ ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో.. అతి త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లను మొదలు పెట్టాలని ఐడియాలు ఇస్తున్నారట. చికోటికి ధైర్యం చెప్పేందుకు ఇప్పటికే పలు హిందూ సంస్థల సపోర్ట్‌ను కూడా కూడబెట్టినట్లు తెలుస్తోంది. మరి చికోటి కొత్త పార్టీ పెడతారా? లేదా మరేదైనా పార్టీలో చేరుతారా? అసలు ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందా? ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభావం ఉంటుందా? అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.