Home > తెలంగాణ > నన్నే పార్టీలో చేర్చుకోరా..నా రాజకీయం నేను చేస్తా : చికోటి ప్రవీణ్

నన్నే పార్టీలో చేర్చుకోరా..నా రాజకీయం నేను చేస్తా : చికోటి ప్రవీణ్

నన్నే పార్టీలో చేర్చుకోరా..నా రాజకీయం నేను చేస్తా : చికోటి ప్రవీణ్
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‎. అందుకోసం బీజేపీ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం సిటీ మొత్తం భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. భారీ ర్యాలీతో తీరా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తే... బీజేపీ నేతలు ముఖం చాటేశారు. దీంతో చివరి నిమిషంలో ఆయన చేరికకు బ్రేక్ పడింది. దీంతో చికోటి ఫాలోవర్స్ బీజేపీపై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీలో తనను చేర్చుకోకపోవడంతో చీకోటి ఘాటుగా స్పందించారు. ఓ వీడియోను విడుదల చేసి తనను ఏ శక్తులు ఏమీ చేయలేవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా రాజకీయం నేను చేస్తా అంటూ సవాల్ విసిరారు.

వీడియోలో చికోటి మాట్లాడుతూ..." నా అభిమానులు నిరుత్సాహ పడ్డారు. కానీ చికోటి నిరుత్సాహపడలేదు. ఈ సంఘటనతో నేనంటే ఎంత భయమో అర్థమైంది. ఏ శక్తులు ఏం చేసినా చికోటిని ఏం చేసేది లేదు. ముందు ముందు గట్టిగా, అద్భుతంగా రాజకీయాల్లోకి వాస్తాను. ఎవరైతే కుళ్లు రాజకీయాలు చేస్తున్నారో వారికి ఇదే నా సవాల్. మీ లాగా వెన్నుపోటు రాజకీయాలు నాకు రావు. ముందుండి ఎదుర్కోవాలి. మీ రాజకీయాలు మీరు చేయండి నా రాజకీయాలు నేను చేస్తా. ఇబ్బంది ఏమీ లేదు. రేపు ఏ రకంగా రాజకీయాల్లోకి వస్తానో చూసి మీరు ఏడుస్తారు. ఆ రోజు కచ్చితంగా వస్తుంది. ఇదే నా ఛాలెంజ్"అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


Updated : 13 Sept 2023 1:20 PM IST
Tags:    
Next Story
Share it
Top