Ponnam Prabhakar : తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం.. ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం
X
అసెంబ్లీలో ప్రభుత్వం కులగణన తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. కాగా సర్కారు కులగణన, జనగణన సర్వే చేస్తామంటోందని అన్ని రకల పదాలు వాడితే గందరగోళం ఏర్పటుందని ఎమ్మెల్యే కడియ శ్రీహరి అన్నారు. ఇందులో ప్రతి పక్షాల అభిప్రాయలను తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం శుక్రవారం ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. కుల గణన చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేసి.. ప్రజల ఆర్థిక స్థితి గతులు తెలుసుకుంటామని అన్నారు. సర్వేలో అన్ని వివరాలు పొందు పరుస్తామని.. సర్వ రోగ నివారిణిలా సర్వే ఉంటుందని పేర్కొన్నారు. కాగా, కులగణనను తాము ఆహ్వానిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత కడియం తెలిపారు.
భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం ఉండాలని, ఎలాంటి కోర్టు కేసులకు అవకాశం ఉండకూడదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కులగణన పూర్తికాగానే వెంటనే చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కులగణన తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో ముందే చెప్పాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.ఎంబీసీలను మొదటి గుర్తించినదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గంగుల చెప్పారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. బీసీ సబ్‌ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్లో ఇప్పిటికే కులగణన చేశారని, కానీ న్యాయపరమైన చిక్కులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల హామీలో భాగంగా బీసీ కుల గణనపై ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. ఈ క్రమంలోనే బీహార్ తరహాలో సమగ్ర కుల గణన చేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కూడా కుల గణన పూర్తి కావొస్తోందన్నారు.. ఈనేపథ్యంలోనే తెలంగాణలో బీసీ గణన చేపడతున్నట్లు పేర్కొన్నారు