Fake Passports: నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం
X
నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ జారీ కేస్‌లో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరు జిల్లాల్లో పాస్‌పోర్ట్ బ్రోకర్‌ని సీఐడీ అరెస్ట్ చేసింది. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్‌పోర్ట్ పొందినట్లు గుర్తించడం జరిగింది. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్‌పోర్ట్ ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పాస్‌పోర్ట్‌లతో కొంత మందికి వీసాలను సైతం నిందితులు జారీ చేశారు. కెనెడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇప్పించడంలో కొంతమంది పోలీస్ అధికారుల హస్తమున్నట్టు సమాచారం. పోలీస్ అధికారుల ప్రమేయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. పలువురు పాస్‌పోర్ట్ సిబ్బంది పాత్రపై సైతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 92 మంది నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ పొందినట్టు అధికారులు గుర్తించారు.