Home > తెలంగాణ > TSPSC : టీఎస్పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు : రంగనాథ్

TSPSC : టీఎస్పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు : రంగనాథ్

TSPSC : టీఎస్పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు : రంగనాథ్
X

టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీసీఎస్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇప్పటివరకు 109మందిని అరెస్ట్ చేశామన్న ఆయన.. మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశముందన్నారు. ఈ వ్యవహారంలో కొన్ని లింక్స్ మిస్సయ్యాయని.. సిబ్బంది వాటిపై ఫోకస్ పెట్టారన్నారు. ఈ కేసులో ఎవరు ఏం చేశారు.. ఎవరి పాత్ర ఎంత అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ అంశాల చుట్టే తమ విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

కాగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే చైర్మన్ జానార్ధన్ రెడ్డి సహా పలువురు కమిషన్ సభ్యులు రాజీనామా చేశారు. ఈ అంశంపై స్పీడ్ పెంచిన రేవంత్.. రెండు రోజుల క్రితం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. గంట సేపు జరిగిన ఈ సమావేశంలో తొలుత యూపీఎస్సీ పనితీరు, పరీక్షల నిర్వాహణ గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీఎస్పీఎస్సీలో జరిగిన లోటుపాట్లు, తప్పొప్పులను యూపీఎస్సీ ఛైర్మన్ దృష్టికి తెచ్చారు. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వాహణ, ఫలితాల వెల్లడికి సంబంధించి పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళకు సహకరించాల్సిందిగా మనోజ్ సోనీని సీఎం కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Updated : 9 Jan 2024 1:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top