గద్దర్ కు ప్రముఖుల నివాళి, ఫోటో గ్యాలరీ....
X
ప్రజా సందర్శనం కోసం ఎల్బీ స్టేడియంలో ఉంచిన గద్దర్ పార్ధివ దేహానికి పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, జానారెడ్డి, అంజనీ కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బూర నర్శయ్య గౌడ్, గరికపాటి నర్శింహరావు, నటుడు మోహన్ బాబు, బండ్ల గణేష్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి తలసాని యాదవ్, టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు.
గద్దర్ అంతియాత్ర మరికొద్ది సేపటిలో ఎల్బీనగర్ స్టేడియం నుంచి మొదలవుతుంది. కళాకారులతో భారీ ర్యాలీగా ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్ళనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ఇందులో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్ బాగ్ చౌరస్తా, జగజ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు సాగనుంది. అక్కడ అమరవీరుల స్థూపం దగ్గర కళాకారులు పాటలతో కాసేపు నివాళులర్పించనున్నారు. తర్వాత సికింద్రాబాద్ మీదుగా భూదేవినగర్ లోని గద్దర్ ఇంటికి చేరుకోనుంది. ఆల్వాల్ లోని మహాబోధి గ్రౌండ్స్ లో అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.