Telangana Govt : తెలంగాణకు 175 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్.. మోదీకి కిషన్ రెడ్డి థ్యాంక్స్
X
రాష్ట్రంలోని డిఫెన్స్ ల్యాండ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణశాఖకు చెందిన 175 ఎకరాలను తెలంగాణను అప్పగించింది. దీంతో హైదరాబాద్-కరీంనగర్, హైదరాబాద్ - నిజామాబాద్ రూట్ల ఎలివేషన్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సందర్భంగగా ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్కు కిషన్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రజాసౌకర్యం కోసమే సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూముల బదిలీ జరిగిందన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల మౌలికవసతులు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి శామీర్‌పేట, హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.