Home > తెలంగాణ > Central Election Commission: హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. 3 రోజులు బిజీ షెడ్యూల్..

Central Election Commission: హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. 3 రోజులు బిజీ షెడ్యూల్..

Central Election Commission: హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. 3 రోజులు బిజీ షెడ్యూల్..
X

కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్కు చేరుకుంది. 9మంది సభ్యులతో కూడిన బృందాన్ని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రిసీవ్ చేసుకున్నారు. సీఈసీ సభ్యుల కోసం 20 వాహనాలతో కాన్వాయ్ ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల పర్యటన నేపథ్యంలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఎలక్షన్ టీం అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతను సమీక్షించనుంది.

తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం పలు రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో భేటీ కానుంది. తొలి రోజు పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఈసీ బృందం జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలతో సమావేశంకానుంది. ఈ భేటీకి ప్రతి పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులు హాజరుకానున్నారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి అన్ని పార్టీల సలహాలు సూచనలను సభ్యులు తెలుసుకోనున్నారు.

రాజకీయ పార్టీలతో భేటీ అనంతరం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఇందులో ఎక్సైజ్, ఇన్‌కం టాక్స్, జీఎస్టీ, ట్రాన్స్‌పోర్ట్, ఇతర నిఘా విభాగాల అధికారులు పాల్గొంటారు. ఎన్నికల సమయంలో జనానికి డబ్బు, మద్యం, ఫ్రీ గిఫ్టులు ఇవ్వకుండా ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించనున్నారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలన్న అంశంపైనా భేటీలో చర్చ జరగనుంది. అనంతరంఎన్నికల సన్నద్దతకు సంబంధించి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్, రాజ్, స్టేట్, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ నోడల్ అధికారులు సీఈసీ బృందానికి ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

అక్టోబర్ 4 బుధవారం ఉదయం 6.30గంటలకు కేంద్ర ఎన్నికల బృందం కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించే ఓటర్ల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొననుంది. సైక్లథాన్, వాకథాన్ ప్రోగ్రాంల ద్వారా ఓటర్లను చైతన్యవంతుల్ని చేయనుంది. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్, ఎస్పీలతో భేటీ కానున్నారు. జిల్లా స్థాయిలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనున్నారు.

అక్టోబర్ 5 గురువారం పలువురు ప్రముఖులు, దివ్యాంగ, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమవుతుంది. అనంతరం చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు డీజీపీ అంజనీ కుమార్ లతో కలిసి కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం ఈసీ సభ్యులు ఢిల్లీకి తరలివెళ్లనున్నారు. ఆ తర్వాత ఏ క్షణానైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది.

Updated : 3 Oct 2023 8:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top