Home > తెలంగాణ > తెలంగాణ వ్యవసాయరంగం అద్భుతం .. కేంద్రం ప్రశంసలు

తెలంగాణ వ్యవసాయరంగం అద్భుతం .. కేంద్రం ప్రశంసలు

తెలంగాణ వ్యవసాయరంగం అద్భుతం .. కేంద్రం ప్రశంసలు
X

అనేక నూతన వ్యవసాయ పద్ధతులు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. వ్య‌వ‌సాయ రంగంలో రాష్ట్రం సాధించిన ప్ర‌గ‌తి అద్భుతం అంటూ కితాబు ఇచ్చింది. వ్యవసాయ రంగంలో ఐటీ అనుసంధానం చేసిన విధానాన్ని కేంద్రం మెచ్చుకుంది.

ఖరీఫ్‌ సీజన్‌ సన్నద్ధతపై గురువారం హైదరాబాద్‌లో కేంద్ర వ్యసాయ శాఖ జాయింట్ సెక్రటరీ డా. యోగితా రాణా.. తెలంగాణ వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా "పర్ డ్రాప్ మోర్ క్రాప్" పథకాన్ని అమలు చేయడంలో అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు.

సాగు రంగంలో సైతం తెలంగాణ రాష్ట్రం కీల‌కంగా మారింద‌ని కొనియాడారు. 2014-15 లో 129.04 ల‌క్ష‌ల ఎక‌రాలు ఉన్న సాగు విస్తీర్ణం.. 2022-23 సంవ‌త్స‌రం నాటికి 232.58 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. తాజా కేంద్ర ప్రభుత్వ రిపోర్టు ప్రకారం వరి సాగు విస్తీర్ణం 2014లో 22.74 లక్షల ఎకరాలు నుంచి 2022లో 64.99 లక్షలకు ఎకరాలకు పెరిగిందని డా. యోగితా రాణా వివరించారు. తెలంగాణలో విత్తనాలు, ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని, 950కి పైగా ఆగ్రో రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఏకంగా కేంద్ర ప్రభుత్వం ప్రసంశించడంపై తెలంగాణ ప్రభుత్వం ఖుషీ అవుతోంది.

Updated : 14 July 2023 4:48 PM IST
Tags:    
Next Story
Share it
Top