Home > తెలంగాణ > తెలంగాణ అభివృద్ధి కోసం.. కేంద్రం అంకిత భావంతో పని చేస్తోంది: ప్రధాని మోదీ

తెలంగాణ అభివృద్ధి కోసం.. కేంద్రం అంకిత భావంతో పని చేస్తోంది: ప్రధాని మోదీ

తెలంగాణ అభివృద్ధి కోసం.. కేంద్రం అంకిత భావంతో పని చేస్తోంది: ప్రధాని మోదీ
X

వరంగల్ పర్యటనలో భాగంగా.. ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. కేంద్ర తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం కొత్తది.. అయినా, పాత్ర చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం తెలుగు వారి ప్రతిభను, దేశ సామర్ధ్యాన్ని పెంచిందని ప్రశంసించారు. ఆ కారణంగానే తెలంగాణ ను చిత్త శుద్ధితో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.





‘తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో అంకిత భావంతో పనిచేస్తోంది. ఇక్కడ అభివృద్ధి కోసం 9ఏళ్లుగా కృషి చేస్తున్నాం. తెలంగాణలో కనెక్టివిటీ పెంచెందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ ముందు అపార అవకాశాలున్నాయి. వాటిని సద్శినియోగం చేసుకుని ఉన్నత స్థానాలు ఎదగాలి. రాష్ట్రంలో కనెక్టివిటీ పెంచెందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. అయినా, కొత్త లక్ష్యాల కోసం కొత్త మార్గాలు అన్వేషించాల్సిందే. తెలంగాణ ప్రస్తుతం ఆర్థిక హబ్ గా ఎదుగుతోంది. చుట్టు పక్కల ఆర్థిక కేంద్రాలను తెలంగాణ జోడిస్తోంద’ని ప్రధాని మోదీ సభలో పేర్కొన్నారు.

ప్రసంగానికి ముందు తెలంగాణలో రూ.6,100 కోట్లతో అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. వర్చువల్ గా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమ, రూ.2,147 కోట్ల వ్యయంతో చేపట్టనున్న జగిత్యాల-కరీంనగర్-వరంగల్ ఇంటర్ కారిడార్ ను వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఎకనామిక్ కారిడార్లో భాగంగా రూ.3,441 కోట్లతో చేపట్టబోయే మంచిర్యాల-వరంగల్ నేషనల్ హైవేకు ప్రధాని శ్రీకారం చుట్టారు.




Updated : 8 July 2023 12:38 PM IST
Tags:    
Next Story
Share it
Top