Home > తెలంగాణ > డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. లక్షకు పైగా జీతం

డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. లక్షకు పైగా జీతం

డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. లక్షకు పైగా జీతం
X

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన గడువు సమీపిస్తుంది. అర్హులైన వారంతా డిసెంబర్ 15 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 995 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌(ACIO) గ్రేడ్‌-2/ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

క్వాలిఫికేషన్: ఏదైనా గుర్తిపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

ఏజ్ లిమిట్: 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితి ఉంటుంది)

జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ ఫీ: ఎగ్జామ్ ఫీ రూ.100లు కాగా.. రిక్రూట్‌మెంట్‌ ప్రాసెసింగ్‌ రుసుం రూ.450 చొప్పున కట్టాల్సి ఉంటుంది.

ఈ కింది లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి:

https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/86382/Index.html

Updated : 10 Dec 2023 6:07 PM IST
Tags:    
Next Story
Share it
Top