Home > తెలంగాణ > సింగరేణి యాజమాన్యంపై హైకోర్టులో కేంద్రం పిటిషన్

సింగరేణి యాజమాన్యంపై హైకోర్టులో కేంద్రం పిటిషన్

సింగరేణి యాజమాన్యంపై హైకోర్టులో కేంద్రం పిటిషన్
X

తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై కేంద్ర రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి గత నెల 27న జరిగిన మీటింగ్‌కు సింగరేణి యాజమాన్యం హాజరుకాలేదని, తుది ఓటర్ల జాబితాను ప్రకటించలేదని అందులో ప్రస్తావించింది.

కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 28న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ సిద్దం చేశామని కేంద్రం కోర్టుకు విన్నవించింది. అయితే సింగరేణి యాజమాన్యం సహకరించకపోవడం వల్ల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని పిటిషన్లో స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా సింగరేణి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం అభ్యర్థించింది. కార్మికశాఖ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈనెల 11న వాదనలు వింటామని ప్రకటించింది.

ఇదిలా ఉంటే కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఇప్పటికే సింగరేణి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అక్టోబర్‌ 5న విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం ధర్మాసనాన్ని కోరింది. ఈ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్న సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే ఇవ్వాలని డివిజన్‌ బెంచ్‌ను కోరింది. సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.




Updated : 7 Oct 2023 4:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top