తెలంగాణలో రూ.1.10 లక్షల కోట్ల ప్రాజెక్టులు మొదలవుతాయి: గడ్కరీ
X
కేంద్రం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. వరంగల్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన.. ఘతిశక్తి ప్రణాళికలో భాగంగా దేశంలో అద్భుతమైన మౌలిక వసతులు, రోడ్లు ఉంటే.. దేశం అభివృద్ది చెందినట్లు అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు రూ.1.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టామని, 2024 నాటికల్లా రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులను పూర్తిచేస్తామని గడ్కరీ తెలిపారు. ‘ఉత్తరాది, దక్షిణాదిని అనుసంధానిస్తూ.. సూరత్ నుంచి హైదరాబాద్, వరంగల్, కర్నూలు మీదుగా హైవేను నిర్మిస్తున్నామ'ని తెలియజేశారు.
రాబోయే కాలంలో రహదారుల విస్తరణలో తెలంగాణ ప్రత్యేక కారిడార్ గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. కరీంనగర్- వరంగల్ 68 కిలోమీటర్ల నేషనల్ హైవేని.. 2 వేల 150 కోట్లతో నాలుగు లైన్లగా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఇలా చేయడం ద్వారా ఆయా ప్రంతాల్లో మెగా టెక్స్ టైల్ పార్కుతో పాటు ఇండస్ట్రీయల్ కారిడార్ కూడా డెవలప్ అవుతుందన్నారు గడ్కరీ.