Home > తెలంగాణ > Medigadda Barrage: మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. ప్రాజెక్టు ను పరిశీలించనున్న కేంద్ర బృందం

Medigadda Barrage: మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. ప్రాజెక్టు ను పరిశీలించనున్న కేంద్ర బృందం

Medigadda Barrage: మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. ప్రాజెక్టు ను పరిశీలించనున్న కేంద్ర బృందం
X

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్ద శనివారం కొన్ని పిల్ల‌ర్లు మునిగిపోవడంతో సమీపంలో 144 సెక్షన్ విధించారు. కేంద్ర జల సంఘం సభ్యులు నేడు(అక్టోబర్ 24న) బ్యారేజీని సందర్శించి నష్టాన్ని అంచనా వేయనున్నారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృతంలోని ఈ ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డకు వచ్చి వంతెన కుంగుబాటును ప్రత్యక్షంగా పరిశీలించనుంది.

భారీ శబ్దంతో శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా.. అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. 45,260 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీకి ఇన్ ఫ్లో 12,240 క్యూసెక్కులుగా ఉంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పునరుద్ధరణ బాధ్యత ప్రస్తుతం బ్యారేజీ ఆధీనంలో ఉన్న ఎల్ అండ్ టీ సంస్థదేనని స్పష్టం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ 6వ బ్లాక్‌ కింద 20వ పిల్లర్‌ అడుగుల వరకు కూలిపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం సాయంత్రం బ్యారేజీ సమీపంలో పెద్ద శబ్ధం రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై విచారణ చేపట్టామన్నారు. బ్యారేజీలో నీరు ఉన్నందున ఇప్పుడేమీ చెప్పలేమనీ, పూర్తిస్థాయిలో విచారణ జరిపి నీరు తగ్గిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బ్యారేజీలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు 20వ స్తంభం సమీపంలోని గేట్లను మూసివేసి ఇతర గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.




Updated : 24 Oct 2023 10:59 AM IST
Tags:    
Next Story
Share it
Top