నవంబర్ 30న సెలవు కాదు: వికాస్ రాజ్
X
ఎన్నికల పోలింగ్ తేదీ నవంబర్ 30న నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే అది హాలిడే కాదని, ఓటింగ్ డే అని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఓటింగ్ డే రోజు ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని ఈసారి దాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటు వేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత. నవంబర్ 30 జరిగే ఓటింగ్ లో ఓటర్లు తమ బాధ్యతను నెరవేర్చుకోవాలని ప్రశాంతంగా, స్వేచ్చగా తమ హక్కును వనియోగించుకోవాలని అన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలీసులతో సహా మొత్తం 3లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. రాష్ట్రంలో 4,70,270 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, 8,84,584 ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ముద్రించామని తెలిపారు. టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు కోసం అదనపు బ్యాలెట్ పత్రాలను, తపాలా శాఖ ద్వారా 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు.