మునుగోడులో కాంగ్రెస్కు షాక్.. బీజేపీలో చేరిన చలమల కృష్ణారెడ్డి
X
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగలింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి హస్తం పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించిన కృష్ణారెడ్డికి పార్టీ హైకమాండ్ షాకిచ్చింది. దీంతో ఆయన కమలదళంలో చేరారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. అయితే హైకమాండ్ చివరకు పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించింది. ఆమె గెలుపు కోసం కృషి చేసినా బీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తనకే టికెట్ ఇస్తుందని చలమల భావించాడు. చివరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అధిష్టానం ఆయనకే టికెట్ ఇచ్చింది.
కాంగ్రెస్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తికి గురైన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మునుగోడు బరిలో తప్పక నిల్చుంటానని తేల్చిచెప్పారు. చివరకు బీజేపీ పార్టీ కీలక నాయకులతో చర్చించిన ఆయన.. అనుచరుల కోరిక మేరకు బీజేపీలో చేరారు. మునుగోడు టికెట్ ఇస్తామన్న హామీతోనే చలమల కృష్ణారెడ్డి కమలదళంలో చేరినట్లు సమాచారం.