Home > తెలంగాణ > KTR :మార్చి 1న చలో మేడిగడ్డకి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌

KTR :మార్చి 1న చలో మేడిగడ్డకి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌

KTR  :మార్చి 1న చలో మేడిగడ్డకి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌
X

మార్చి 1 నుంచి ఛలో మేడిగడ్డ చేపడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 150-200 మంది బీఆర్‌ఎస్‌ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అందరు కలిసి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తామన్నారు. వారికి వాస్తవాలు చెప్పేందుకు అక్కడకి వెళ్తమని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా అన్నాదాతకు కన్నీళ్లు పెట్టించిందని కేటీఆర్ మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవాహిస్తున్నాతెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు.

గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం గర్జించిందని నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఈమేరకు మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తీరులో సాగుతోందని, మేడిగడ్డపై రేవంత్ సర్కార్ దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో మొత్తం 84 పిల్లర్లు ఉండగా కేవలం 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని కేటీఆర్ చెప్పారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.




Updated : 27 Feb 2024 12:56 PM IST
Tags:    
Next Story
Share it
Top